చీపురుపల్లి నియోజకవర్గంలో రైతులను సన్మానించిన జనసేన నాయకులు

జనసేన

      చీపురుపల్లి ( జనస్వరం ) : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు విసినిగిరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమం జరిగింది. మండలంలో కొంత మంది రైతులకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో విసినిగిరి శ్రీనుగారు, తుమ్మగంటి సూరి నాయుడు గారు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం రైతులను మర్చిపోయిందని, రైతులకి ఇవ్వాల్సిన పరిహారాలు ఇవ్వడం కూడా మర్చిపోయిందని, కనీసం గిట్టు బాటు ధర ఇవ్వకుండా, రైతుల నుండి ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో కూడా లేదు అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 న్నర సంవత్సరం లో రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య లు చేసుకుంటే కనీసం పట్టించుకోలేదని అన్నారు. వారిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి 1 లక్ష చొప్పున 30 కోట్లు పరిహారం ఇస్తుంటే ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిలో ఉందే గానీ, రాష్త్రం ని పట్టించుకోవట్లేదు అని చెప్పారు. అలాగే జనసేన ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రైతులకు ఉచిత సోలార్ యూనిట్లు అలాగే, 60 సంవత్సరాలు దాటిన కౌలు రైతులకు నెలకు 5000 ఇస్తారు అని, అలాగే వ్యవసాయం చేయాలి అనుకునే యువ రైతులకి ప్రభుత్వ భూమిని లీజకు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమం లో T. సూరి నాయుడు గారు, రామచంద్ర రాజు గారు, ఆదినారాయణ గారు, రామచంద్ర రావు గారు, లక్ష్మణ నాయుడు, తవిటి నాయుడు, కిరణ్, నరసింహ అలాగే జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way