Logo
Date of Publish : 07 December 2022, 8:16 am
Editor : Sake Naresh

రహదారులు, పాడుపడిపోయిన వంతెనలకు మరమత్తులు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు

          రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా, జాయింట్ కలెక్టర్ గారికి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ టి.సుండుపల్లి మండలంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు టి.సుండుపల్లె మండల పరిధిలో రోడ్లు చాలా అద్వాన్నంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా వంతెనలు అక్కడక్కడా పాడుపడిపోయి ఉన్నాయి. దీని వలన వాహనదారులు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా, అనేక ప్రమాదాలు కూడా జరుగుచున్నవి. దీని వలన ప్రాణనష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అన్నమయ్య జల్లా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చాలా అధ్వాన్నంగా వున్నాయి. దీని వలన స్కూలు పిల్లలు సకాలంలో స్కూళ్ళకు వెళ్ళలేక, పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీలు సకాలంలో ఆసుపత్రులకు పోలేక ఇలా అనేకమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నారు. ఈ సమస్యలు పట్ల గతంలో కూడా జనసేనపార్టీ తరపున పలు సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చామని అన్నారు.. కావున తమరు వెంటనే ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించవలసినదిగా కోరుచున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com