Logo
Date of Publish : 23 November 2022, 6:16 pm
Editor : Sake Naresh

సూళ్లూరుపేట ఎమ్మెల్యేపై ధ్వజమెత్తిన జనసేన నాయకులు రోసనూరు సోమశేఖర్

సూళ్లూరుపేట ( జనస్వరం ) : పెళ్లకూరు మండలం గుర్రపు తోట నుంచి పాలచ్చూరు గ్రామానికి వెళ్లే రోడ్డుని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు అత్యంత దారుణంగా తయారైందని స్థానిక సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవయ్య గారిపై నిప్పులు చెరిగారు. సుమారు 7 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డుని ఒక దశాబ్దం పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కళ్ళకి కనపడకపోవడం ఆశ్చర్యం వేస్తుందని వాపోయారు. గ్రామాల ప్రజలు అంటే ఈ శాసనసభ్యుడికి చిన్నచూపు మరియు అసలు పట్టదేమో అనిపిస్తుంది అన్నారు. ఈ రోడ్డుమీద ప్రయాణించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి. అభివృద్ధిని గాలికి వదిలేసిన ఈ వైసీపీ ప్రభుత్వం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్షాల్ని విమర్శించడం, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడిపోయాడు నాయకుడు కాదు లాంటి చౌకబారు మాటలు వైసీపీ ఎమ్మెల్యే అసమర్ధతకు అద్దం పడుతుంది అని ఎద్దేవా చేశారు. మీ ముసలి ప్రాయంలో సంజీవయ్య యువసేన అని పెట్టుకున్నప్పుడు ప్రజలు ఎలా నవ్వుకున్నారో, జనం కోసం పుట్టిన జనసేన ను రౌడిసేన అంటే ప్రజలు దేనితో నవాల్లో అర్థం కావట్లేదు అంటూ సోమశేఖర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్న ఈ ఒక సంవత్సరంలో అయినా గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని వైసీపీ ఎమ్మెల్యేకి సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com