ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రేఖా గౌడ్, ఆదేశాల మేరకు రెండవ రోజు ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటికి ఒక మొక్క రెండు గ్లాస్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, మండలం ప్రధాన కార్యదర్శి బజారి, కర్ణం రవి, లు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా బాధ్యతగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక్కసారి జనసేన వైపు చూడాలని గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, రసీద్, రాముడు, మద్దిలేట్టి, రామకృష్ణ, నరేంద్ర, ధర్మ, శ్రీహరి, వీరేంద్ర, విష్ణు, మహేష్, రఘు, మైబుబ్ భాష, శివ, వెంకటేష్, సాలన్న, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com