రాజోలు ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజోలు నియోజకవర్గంలో రైతుల పాలిట శాపంగా మారిన అకాల వర్షాల వల్ల వరి పంట దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు మద్దతు ధర 1530 రూపాయలకు కోనుగోలు చెయ్యాలని, మిల్లర్లు వద్దకు తడిసిన ధాన్యన్ని సుమారు 50,70, కి,మి దూరం ట్రాన్స్ పోర్ట్ లో రైతులు తీసుకొని వెళ్ళినా ఆ ధాన్యాన్ని మేం కొనుగోలు చెయ్యం అని వెనక్కు తీసుకుని వెళ్ళిపొండి అంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,.సంచులు గానీ, బారకాలుగానీ, ఇవ్వలేని పరిస్థితిలో ఉండి రైతు భరోసా ద్వారా మొత్తం పంటను కొనుగోలు చేస్తాం అని టీవీ ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యింది ఈ ప్రభుత్వం. ఇంకా కోత దశలో ఉన్న గానీ టార్గెట్ అయిపోయింది అని రైతులను భయాందోనల కలిగించే విధంగా ప్రభుత్వం వ్యహరిస్తుంది అని, ఈ క్రాప్ లో నోట్ అయిన మొత్తం వరి పంటను కోనుగోలు చెయ్యాలని, పంట దెబ్బతిన్న రైతులకు తక్షణమే ఏకరాకు 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, రైతుల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా రాజోలు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద మహనీయుల విగ్రహాలకు పూల మాలలు వేసి అక్కడ నుండి జనసేన నాయకులు ర్యాలీగా వెళ్లి MRO కార్యాలయం వద్ద తహిశిల్దర్ గారికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ నాయకులు, మండల, గ్రామ స్థాయి నాయకులు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ,క్రియాశీలక సభ్యులు, క్రియా వాలంటీర్ లు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.