Logo
Date of Publish : 13 November 2023, 9:54 pm
Editor : Sake Naresh

పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన నాయకుల డిమాండ్ 

      నూజివీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో అకాల వర్షంతో దాదాపు గ్రామంలో 250 ఎకరాలు పంట నీట మునిగి గింజ మొలకలు రావడంతో పంట నష్ట పోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు గారు పంట పొలాలను పరిశీలించి,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ ఒక వైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయి కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టంలో పూర్తిగా రైతులు దాదాపు ఎకరాకు 30 వేల మేర నష్టపోయారని కనీసం వర్షాలు వచ్చి వారమైన నేటికీ అధికారులు వచ్చి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై బర్మా ఫణి బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి వెంటనే రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు ఆయనతో పాటు చెక్కపల్లి గ్రామ రైతులు జనసేన నాయకులు పాశం నాగబాబు, తోట సత్యం, శ్రీధర్, మారుతి, రవి, శ్రీను, సతీష్, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, సురిసెట్టీ శివ, గొల్లపల్లి శ్రీకాంత్, కడియం సత్యనారాయణ, శ్రీను పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com