అరకు ( జనస్వరం ) : జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా మెడికల్ క్యాంపులు పెట్టి వీళ్ళు చేస్తున్న కృషి కి అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తామని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబంలో వెలుగు నింపుతున్న పిఆర్ఓ లను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీలుసుకోవాలని యువతకి పిలుపునిచ్చారు. నిస్వార్థంగా కృషి చేస్తూ, గిరిజన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపెనింగ్ చేస్తూ, రోగులను గుర్తించి, సరైన వైద్యం అందించాలని వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని అనిల్ నిరుకొండ హాస్పిటల్ తగరపువలస, వైజాగ్ వారి సహకారంతో ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వార నిరుపేద కుటుంబాలకి సహాయం అందిస్తున్న పిఆర్ఓ లకు అభినందలు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు ఉచితంగా అరోగ్య శ్రీ ద్వార పిఆర్ఓ ల సహాయంతో ముందుకు రావాలని కోరారు పిఆర్ఓ 1)శోభ రాంబాబు, జంగంపుట్టు గ్రామం, 2) శోభ సుందర్, 3) జన్ని బొంజుబాబు, దుర్గం గ్రామం సంప్రదించవలసిన నంబర్స్: 6305319386, 8688965214, 8333849656 అరోగ్య శ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక, సక్రమంగా చికిత్స అందించలేక గిరిజన ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని అన్నారు. తక్షణమే అరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ స్పందించి నియోజక వర్గంలో మీ వైసిపి నాయకులకు ప్రభుత్వ ఆసుపత్రి లో మెరుగైన వైద్యం అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జనసేన నాయకులు కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com