Logo
Date of Publish : 19 October 2023, 7:29 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మైఫోర్స్ మహేష్ ను అభినందించిన జనసేన నాయకులు

      మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర నూతన  కార్యవర్గంలో మదనపల్లి నియోజకవర్గ నాయకుడు డాక్టర్ మై ఫోర్స్ మహేష్ ను జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నియమించిన విషయం విధితమే. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మై ఫోర్స్ మహేష్ ను ఘనంగా దుస్సాలో పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ విధివిధాలను ఆశయాలను ప్రజలకు తీసుకెళ్తూ పార్టీ నిర్ణయించిన ప్రతి కార్యక్రమం ఇంటింటికి తీసుకెళ్తూ పడమటి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు. మై ఫోర్స్ మహేష్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని, కష్టపడే ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో అండగా ఉంటుందని అన్నారు. ఉన్నత పదవులు ఇస్తుందనే దానికి మై ఫోర్స్ మహేష్ కి పదవి రావడం ఉదాహరణ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుపటి సుభాషిని మాట్లాడుతూ జనసేన పార్టీ  ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజలకు తెలుసుకున్న మహేష్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవి రావడంతో జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశారు. చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర్ నారాయణ మాట్లాడుతూ మై ఫోర్స్ మహేష్ తో పాటు జనసేన పార్టీలో ముందు నుంచి కష్టపడి పని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని మున్ముందు మై ఫోర్స్ మహేష్ మరింత ఎదగాలని కోరుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన నన్ను సన్మానించి నాకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు, అలాగే మొదటి నుంచి నన్ను ప్రోత్సహించినందుకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com