గుంతకల్ ( జనస్వరం ) : గుంతకల్ పట్టణంలో అభివృద్ధి పనులు నెపంతో 6 ఆరు నెలలైనా సోఫియా కాలనీ ధర్మవరం గేటు దగ్గర వాటర్ పైప్ లైన్ వర్క్ ని పూర్తి చేయకుండా తీసిన గుంతను పూడ్చకుండా అశ్రద్ధ వహిస్తున్న పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వైసిపి ప్రతినిధుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోఫియా కాలనీ వాసుల సహకారంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేటు వద్దనున్న సోఫియా కాలనీలో పైప్ లైన్ కోసం 20 అడుగుల గుంతను సుమారు 6 నెలల క్రితం తవ్వారు అందులో ఒక 15 అడుగుల సిమెంట్ పైపు వేశారు. మిగిలిన స్థలంలో పెద్ద బండ రాయి ఉందని పనులు ఆపి వెళ్లారు. అప్పట్లో విషయం తెలుసుకున్న మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల రోజుల క్రితం సమస్యను తక్షణం పరిష్కరించాల్సిందిగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేసి సంబంధిత అధికారికి వినతిపత్రం అందించాం, అప్పట్లో కొద్దిగా చలించి కాలినడకన రాస్తా మాత్రం ఏర్పాటు చేశారు. పనులు మాత్రం గాలికి వదిలేశారు, దీంతో స్థానికులు మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, కాలనీలో రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ గుంతలో అనేకసార్లు చిన్నపిల్లలు, వృద్ధులు గుంతలో పడి గాయాల బారిన పడిన సందర్భాలు అనేకం, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత ప్రమాదకరంగా మారింది. ఏది ఏమైనా పెద్ద ప్రమాదం జరగక ముందే పనులు పూర్తి చేయడం లేక ఆ గుంతను పూడ్చడమో చేయాలని కాలనీవాసులు, జనసేన పార్టీ పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుండడంతో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏఈ గారు రెండు మూడు రోజుల్లో పనులు స్టార్ట్ చేయడం లేదా గుంతను పూడ్చడము ఏదో ఒకటి కచ్చితంగా చేస్తామని స్థానికులకు హామీ ఇవ్వడం జరిగిందని, త్వరలో గుంతను పూడ్చని పక్షంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిరవధిక దీక్షలకు కూర్చుంటుందని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ సీనియర్ నాయకులు ఆటో రామకృష్ణ కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్, కసాపురం నందా, మోహన్ రాయల్ జనసైనికులు కసాపురం వంశీ, విజయ్ కుమార్, రామకృష్ణ, కసాపురం రామంజి, అమర్, శ్రీనివాసులు, ఐఓసీ శేఖర్, అనిల్ కుమార్, లారెన్స్, వీరేష్, శివ, సోఫియా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com