పార్వతీపురం ( జనస్వరం ) : బలిజిపేట మండలం, బర్లి గ్రామానికి సంబంధించిన వైసిపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు జనసేన నాయకుడిపై చేసిన భౌతిక దాడికి సంబంధించి, వైసిపి నాయకుల పైన 10 రోజుల క్రిందట ఇచ్చిన ఫిర్యాదుకు వైసిపి MLA ప్రోద్బలంతో పోలీసులు FIR కట్టనందున జనసేన రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారు ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయాలని SP గారికి మరియు 1902 కి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. అదేవిధంగా గలావిల్లి గ్రామానికి సంబంధించి సాయికుమార్ అనే పూజారి తమ వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలంలో, నిన్న ఇళ్లు పునాదులు తీస్తే, వైసిపి తూర్పు కాపు కార్పోరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ వర్గం చొరబడి ఈ స్థలం నీది కాదు అని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ఈ విషయమై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారు మరియూ స్థానిక మండల నాయకత్వం MRO గారిని కలవడం జరిగింది. MRO గారు సానుకూలంగా స్పందించి ఆ స్థలం యొక్క పూర్తి వివరాలు ఎంక్వయిరీ చేసి పూజారి సాయికుమార్ కి అప్పజెబుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలివేట మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బొంకురు పోలి నాయుడు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి గంట్యేడ స్వామి నాయుడు, జిల్లా నాయకులు రఘుమండ్ల అప్పలనాయుడు, నారాయణపురం ఆదినారాయణ, పరుచూరి వెంకటరమణ, మామిడి మార్కండేయులు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. కష్టం ఎక్కడ ఉంటే జనసేన అక్కడ అండగా ఉంటుంది.