ఖమ్మం ( జనస్వరం ) : ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేవు, ఉన్న కొన్ని పాఠశాలాల్లో కూడా పరిశుభ్రంగా లేవని కలెక్టర్ గారికి, విద్యాశాఖ అధికారికి ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యవస్థలకు బుద్ధి వచ్చే విధంగా ఖమ్మం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భిక్షాటన చేయడం జరిగింది. అధికారులు స్పందించే వరకు జనసేన పోరాటం చేస్తుంది లేని పక్షంలో భిక్షాటన చేసిన డబ్బులు ద్వారానే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ భిక్షాటన మధ్యలో అనుకోకుండా కలిసిన MLC బాలసాని లక్ష్మీనారాయణ గారికి కూడా సమస్యను వివరించి భిక్షాటన చేయడం జరిగింది.స్థానిక ప్రజలు, అభ్యుదయవాదులు భిక్షాటన కార్యక్రమాన్ని అభినందిస్తూ తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకులు మెడబోయిన కార్తిక్, అజయ్ కృష్ణ, దేవేందర్, కొండా పవన్, బాణాల శ్రీకాంత్, ఉత్తమ్ రాజు, మాలిక్, రమణ కుమార్, పుల్లారావు, గంగాధర్, స్రవంత్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com