నందలూరు, నవంబర్ 10, జనస్వరం : గత వారంలో నందలూరు అరుంధతి వాడలో పాఠశాల సర్పాల నిలయమైందని ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైంది. దీనితో, నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు అరుంధతి వాడ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి మాట్లాడుతూ, “ఈ పాఠశాల ప్రహరీ గోడ అన్నమయ్య వరదల్లో కొట్టుకుపోయింది. గత YCP ప్రభుత్వ కాలంలో ఈ సమస్యపై జనసేన నాయకులుగా మేము స్పందించినప్పటికీ, ఆ ప్రభుత్వం గానీ, అప్పటి YCP నాయకులు గానీ అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు NDA ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం సంబంధిత విద్యాశాఖ అధికారులతో మాట్లాడతాం. ఈ ప్రహరీ గోడ నిర్మాణం జరిగేలా మా వంతు కృషి చేస్తాం” అని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర, జనసేన నాయకులు డాల, ఎద్దుల నరసింహ, భాస్కర్, హరి, నాగరాజు, రమేష్, సుధాకర్ తదితర జనసైనికులు, యువకులు పాల్గొన్నారు.