పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం కేంద్రo లో తహశీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్సపుండరీకం పాల్గొన్నారు. మత్స పుండరీకం మాట్లాడుతూ ముఖ్యంగా వీరఘట్టం మండల కేంద్రo కి చెందిన 250, 251, 252 పోలింగ్ కేంద్రాలు ఓటర్లు ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ కేంద్రo లోపలకి వెళ్లి, వచ్చేoదుకు ఒకే ద్వారం ఉండడం, ఇరుకైన గదులువల్ల ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇళ్ల మధ్యలో పోలింగ్ కేంద్రాలు ఉండడం వలని ఎలక్షన్ జరిగిన రోజు 144 సెక్షన్ ఉండడం వలని కూడా పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరఘట్టం మండలం కేంద్రo కి చెందిన పోలింగ్ కేంద్రలు అన్ని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఒకే చోట ఉండేవిధంగా చూడాలని కోరారు. అదేవిధంగా మండలంలో గిరిజన ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల కు వచ్చేవిధంగా ఉచిత రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. చాలా గ్రామంలో ఓట్లు తొలిగింపు చేయాలని పలుమార్లు దరఖాస్తులు ఇచ్చిన తిరిగి ఆ ఓట్లు యధావిధిగా ఉంటున్నాయి. దీనివలన స్థానిక సంస్థలు ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీ, యస్పీ, ఎస్టీ, లకు రావాలి అవి తారుమారు అవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు అన్ని ఒకే వార్డు లో వుండే విధంగా చూడాలని కోరారు.