ఆముదాలవలస ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైన పరిశ్రమగా పేరుగాంచిన ఆమదాలవలస సహకార చక్కర కర్మాగారాన్ని స్థానిక రైతులు మరియు షేర్ హోల్డర్ల తో కలిసి కర్మాగారం వద్ద జనసేన పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ₹ గళం వినిపించారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 25వేల మంది ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి మరియు లబ్ధి పొందుతున్న ఈ ఆముదాలవలస సహకార చక్కెర కర్మాగారాన్ని మూతపడేటట్లుగా చేసి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. ప్రతిసారి ఈ చక్కెర కర్మాగారంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సభాపతి తమ్మినేని సీతారాం కేవలం ఎన్నికల హామీకి వాడుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయుధం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన నదుల మధ్య ఉన్న ఆముదాలవలస నియోజకవర్గంలో ఉన్న ఈ చక్కెర కర్మ గారానికి అధిక దిగుబడి అందించే విధంగా స్థానిక రైతులు చెరకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారని, వనరులు ఉండి కూడా కర్మాగారం మూసివేయడంతో రైతులకు మేలు జరగడంలేదని అన్నారు. అధికార వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చక్కెర కర్మాగారం ముగిసిపోయిన అధ్యాయమని వర్ణిస్తూ రైతుల కష్టాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదని చక్కెర కర్మాగారం తెరిపించేందుకు అన్ని విధాల జనసేన పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని, ఈ చక్కెర కర్మాగారం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అందించేందుకు రానున్న జనసేన-తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, జనసేన నాయకులు సతీష్ కుమార్ గంగు కోటేష్, స్థానిక రైతులు, ఫ్యాక్టరీ షేర్ హోల్డర్లు పాల్గొన్నారు.