కూకట్ పల్లి, (జనస్వరం) : కూకట్ పల్లి నియోజకవర్గంలోని శిల్ప వెన్యూ దగ్గర ప్రశాంత్ నాయుడు, మహేంద్ర ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేసిన రీలిష్ & చేరిష్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రీలిష్ & చేరిష్ షాప్ ని కూకట్ పల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొల్లా శంకర్, మాదాసు అశోక్, వేణుగోపాల్, పులగం సుబ్బు, రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గాదే శ్రీనివాస్, కౌశిక్, పెద్ది రెడ్డి భరత్ వర్మ, సాయి వర్మ, నాగేంద్ర, కుమార్ చైతన్య, మాధవ నాయుడు, జయంత్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.