శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా భర్త కోటా చంద్రబాబు గారిని చిందేపల్లి గ్రామ రోడ్డు కోసం పోరాటం చేస్తున్నప్పుడు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపడంతో 13 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు కు బెయిలు మంజూరు కావడంతో ఈరోజు శ్రీకాళహస్తి సబ్ జైలు నుండి విడుదల అయ్యారు. శ్రీకాళహస్తి సబ్ జైలు వద్దకు వందల సంఖ్యలో నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ,చిందేపల్లి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలకడానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రోద్భలంతో ఈరోజు జన సేన నాయకులు చంద్రబాబు గారు విడుదల అవుతున్నారని తెలిసి రాత్రికి రాత్రి పోలీస్ ఆక్ట్ 30 ఉందని జైలు వద్దకు చేరుకున్న జనసైనికులు పై ఇష్టానుసారం పోలీస్ లు లాఠీ ఛార్జ్ చెయ్యడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలోని జనసైనికులను రానివ్వకుండా పోలీసుల పహారా కాసి ఎక్కడిక్కడ కార్యకర్తలను అడ్డుకున్నారు. ప్రజల కోసం పోరాడి జైలు నుండి విడుదల అయిన కోటా చంద్రబాబు గారికి వందల సంఖ్యలో జనసైనికులు, నాయకులు, చిందేపల్లి గ్రామ ప్రజలు క్రేన్ తో పులమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఆక్ట్ 30 ఉందని జైలు నుండి నడిచి వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు వింత చేష్టలు చేశారు. కారులో వెళ్తూ కారుపై నుండి ప్రజలకి, జనసైనికులకి అభివాదం చేస్తూ వెళ్తుంటే కారుపై నుండి అభివాదం చెయ్యకూడదు, ప్రజలకి కనపడకుడదని అడుగడుగునా అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటూ కనపడ్డ జనసేన కార్యకర్తలను తరిమించి లాఠీ ఛార్జ్ చేసి , ఆఖరికి వినుత గారిని , భర్త చంద్రబాబు గారిని కారు లోపలకి ఎక్కించి పోలీసు బలవంతంగా శ్రీకాళహస్తి పట్టణం లోని వారి ఇంటికి పంపడం జరిగింది. ఇంటికి వెళ్లే దారి చుట్టూ పోలీసులని పెట్టి కార్యకర్తలను ఆఖరికి ఇంటి వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ప్రోద్భలంతో పోలీసులు అత్యుస్తాహాన్ని ప్రదర్శించి వింత వింత గా ప్రవర్తించి అడుగడుగునా కారు కి అడ్డు పడుతూ జైలు నుండి కోటా చంద్రబాబు గారు ఇంటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు గురిచేయడం హేయమైన చర్య. ఎమ్మెల్యే ఇంతలా జనసేన పార్టీ అంటే భయపడి పోలీసు లను అడ్డు పెట్టుకొని ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడడం నీచ రాజకీయాలకు ప్రతీక. త్వరలో ప్రతి దానికి ప్రజలచే సమాధానం చెప్పించే రోజు ఉందని హెచ్చరిస్తున్నామన్నారు. జైలు వద్ద కోటా చంద్ర బాబు గారికి స్వాగతం పలకడానికి జిల్లా అధ్యక్షులు Dr. హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్, G.D.నెల్లూరు ఇంఛార్జి పొన్ను యుగంధర్, పీలేరు ఇంఛార్జి దినేశ్, సూల్లూరు పేట ఇంఛార్జి ప్రవీణ్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపటి సుభాషిణి, మహిళ రీజనల్ కోఆర్డినేటర్ వనజ, వీర మహిళలు నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.