నెల్లూరు, అక్టోబర్ 26, (జనస్వరం) : మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కృషితో కూటమి ప్రభుత్వం పేదలకు సొంత ఇల్లు అనే కలను నిజం చేస్తోందని జనసేన నేతలు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన టిడ్కో ఇళ్లను ఇప్పుడు సర్వ సౌకర్యాలతో పూర్తి చేసి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టులు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. గృహ సముదాయాల్లో నివసించే కుటుంబాలు ఒక్కో బ్లాక్‌కు ఒక కమిటీగా ఏర్పడి నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు సిటీ 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో హౌసెస్ వద్ద జనసేన పార్టీకి వచ్చిన పలు సమస్యలను పరిశీలించేందుకు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నేతృత్వంలో సందర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ నాయకుడు సుల్తాన్, 53వ డివిజన్ నాయకుడు సురేష్, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్లలో నివసిస్తున్న పలువురు మంచినీటి, డ్రైనేజీ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయానికి తెలియజేసి, సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చినట్లు జనసేన నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నగర కార్యదర్శి హేమచంద్ర యాదవ్, నగర సంయుక్త కార్యదర్శి పసుపులేటి శరవణ, రెండవ డివిజన్ నాయకుడు నాగేంద్రబాలు, 18వ డివిజన్ నాయకుడు వాకాటి వర్షన్, 16వ డివిజన్ నాయకుడు తుమ్మల నరహరి, నాయకులు ఏలూరి కృష్ణమోహన్ రెడ్డి, తరుణ్, ఉమా మహేష్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.