గాజువాక ( జనస్వరం ) : జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు గాజువాక నియోజవర్గం ఇంచార్జ్ కోన తారావు గారి ఆధ్వర్యంలో 71వ వార్డు నుంచి 50 మంది వార్డు అధ్యక్షులు బేతు చైతన్య కృష్ణ, మహిళా నాయకురాలు ఇందిరా ప్రియదర్శిని గారి సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. పేదలు, సామాన్య ప్రజల సంక్షేమమే ఆలోచనతో ఉన్న జనసేన పార్టి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా తాతారావు గారు మాట్లాడుతూ వైసిపి దాష్టిక పాలన అంతం అవుతుందని, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న కష్టాల పై పూర్తి అవగాహన ఉందని, ప్రజలు సుఖసంతోషాల తో గడిపే రోజులు జనసేన టిడిపి పాలన లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దాసరి జ్యోతి రెడ్డి, గవర సోమశేఖర్, యడిడ భార్గవ్, నామాల అర్జున్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com