ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మరియు పీఏసీ సభ్యులు నాగబాబు, పిలుపు మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ ఆదేశాల మేరకు జాతీయ రైతు దినోత్సవాని పురస్కరించుకుని నియోజకవర్గంలోని రైతులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్, పార్టీ సీనియర్ నాయకులు కరణం రవి, లు మాట్లాడుతూ రైతుల కష్టాలను గుర్తించి రైతులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని అన్నారు. రాష్ట్ర రాజకీయలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇప్పటి వరకు సొంత డబ్బులు ఇవ్వలేదని కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులను చనిపోయిన కౌలు రైతులకు ఇచ్చి వారి కుటుంబాలకు భరోసా నిస్తున్నా ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారిని కొనియాడారు. అధికారం కానీ ప్రతిపక్షం కూడా లేనప్పటికీ రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ కి రైతులు అండగా ఉండి వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించి ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షబ్బీర్, వినయ్, నరేష్, షబ్బీర్ మరియు రైతులు హనుమంతు, గిడ్డయ్య, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com