తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : పెంటపాడు మండలం బోడపాడు గ్రామ పల్లెపోరులో భాగంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు, మండల కార్యదర్శి మట్ట అంజి ఆధ్వర్యంలో సుమారు 50 మంది కి పైగా గ్రామ ప్రజలకు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో జనసేన మీద విశిష్ట స్పందన రావడంపై బొలిశెట్టి హర్షం వ్యక్తం చేసి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న దీనిపై ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పైగా రోడ్ల దుస్థితిని మరియు ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్న జనసేన పార్టీ నాయకులపై ఎదురు దాడి చేయించి పోలీస్ లతో కేసులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చే విమర్శలను మాత్రం ప్రభుత్వం ఆపలేక పోతోంది. నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు రహదారుల దుస్థితిపై నిలదీస్తున్నలనీ ప్రస్తుతం వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రధాన విమర్శల్లో రహదారుల, డ్రైనేజీ వ్యవస్థ దుస్తితి కూడా ఒకటనీ రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని తమ పరిస్థితి ఏంటని ప్రజలు గడపగడపకు వచ్చే వైసీపీ నాయకుల్ని నిలదీస్తున్నారనీ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
బోడపాడు గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్య డ్రైనేజీ వ్యవస్థ, రావిపాడు బోడపాడు బల్లకట్టు సమస్య,మంచినీటి సమస్యలను వెంట వెంటనే పునర్దరిస్తానని గ్రామ ప్రజలకు శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే గ్రామంలో పల్లేపోరుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి స్థానిక నాయకులు బోడపాడు గ్రామ కమిటి అధ్యక్షులు మట్టా ఆంజనేయులు, ఆకుల శివప్రసాద్, పల్లెటి రాజేష్, బట్టవిల్లి రవికిశోర్, కుక్కల దుర్గారావు, బెజవాడ దుర్గాప్రసాద్, గుండబత్తుల దుర్గారావు, గుబ్బల మణికంఠ, కుందిరెడ్డి దుర్గారావు, చిలుకూరి తేజ, ఆకుల మురళి, బండి అర్జున్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కొండపల్లి చినశ్రీను, చెంచాని సత్యనారాయణ మరియు పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశి,జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమోగుల సురేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ బైనపాలేపు ముఖేష్, జనసేనపార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మైలవరపు రాజేంద్రప్రసాద్, జగత్ సోమశంకర్, బుద్దన బాబులు, మాదాసు ఇందు, అడబాల మురళి, చాపల రమేష్, పిడుగు మోహన్ బ్రదర్స్, దాగారపు శ్రీను, దంగేటి చందు, జామ్ శెట్టి ప్రసాద్, అర్జుల కిషోర్, పెనుబోతుల బాలాజీ, రావాడ దుర్గారావు, మట్ట రాంబాబు, బద్ధిరెడ్డి రత్తయ్య, ద్వార బంధం సురేష్, నరాల శెట్టి సంతోష్,తమాతపు రాము, జామిశెట్టి ప్రసాద్ మరియు వీరమహిళ విభాగం జిల్లా కో ఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, పెంటపాడు మండల అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు వెజ్జు రత్న కుమారి, ముద్దాల చిన్ని, మధుమతి, బసివి రెడ్డి ప్రశాంతి, సామినేని సత్యవతి, తోట రాణి తదితరులు పాల్గొన్నారు.