ఏలూరు ( జనస్వరం ) : 18వ డివిజన్ లోని పంట బోదే సమస్యను పరిష్కరించాల్సిందిగా జనసేన కార్యక్రమంగా గత నెల ఫిబ్రవరి 10వ తేదీన నగరపాలక సంస్థ అధికారులకు అల్టిమేట్ జారీ చేశామని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.. తదుపరి 15 రోజులు దాటిన ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో నగర పాలక సంస్థ కమిషనర్ కు, నగర మేయర్ కు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులకు మీడియా ద్వారా 18వ డివిజన్లోని పంట బోదే సమస్యను వినిపించారు విన్నవించారు. అయినప్పటికీ 18వ డివిజన్లో పంట బోదె సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈనెల 7 వ తేదీన పంట బోదే సమస్యను తామే స్వయంగా చేస్తామని హెచ్చరించడం జరిగింది.. ఈరోజు పంట బోదే లోని మురుగును జన సైనికులే స్వచ్ఛందంగా చేపట్టి , డివిజన్లో ప్రజల ఆరోగ్యానికి హానికరంగా తయారైన పంట బోదెలోని పూడికను తొలగించి ప్రజా సమస్యను సత్కరించడానికి మంగళవారం జన సైనికులు ఉద్యమించి, జెసిబి తో పంట కాలువలోని మురుగును తొలగించి, 18 డివిజన్లను ప్రజల సమస్యలను జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు నేతృత్వంలో పంట బోదే సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సమస్యలను నాయకులు విని, చూస్తాం, చేస్తామని అంటున్నారు తప్ప, తమ సమస్యలకు పరిష్కారం లభించలేదని, ఈరోజు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు నాయకత్వంలో జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను పరిష్కరించడం పట్ల జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు,సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు,ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు,సరళ, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చిత్తిరి శివ,కోలా శివ,1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, సెక్రటరీ పండు ప్రమీల రాణి, 2 టౌన్ మహిళ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ సుజాత,సంయుక్త కార్యదర్శి తుమ్మపాల ఉమాదుర్గ, నాయకులు రెడ్డి గౌరీ శంకర్,వీరంకి పండు, రాపర్తి సూర్యనారాయణ, బుధ్ధా నాగేశ్వరరావు, జంగం కృపానందం,తేజ ప్రవీణ్,భూపతి బాబు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..