Logo
Date of Publish : 08 August 2022, 2:25 pm
Editor : Sake Naresh

రాబోయేది జనసేన ప్రభుత్వమే : నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

● గూడూరు నియోజకవర్గ జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం 

● రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు

     గూడూరు, (జనస్వరం) : గూడూరు పట్టణంలోని జనసేనపార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరు, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరు, కోట మండల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమ పాలనపై ప్రజలు విసుగేత్తి ఉన్నారని, రాష్ట్రంలోని యువత మరియు మహిళలు జనసేన పార్టీ పట్ల అభిమానం తో పెద్ద సంఖ్యలో చేరుతు న్నారని రాబోయే ఎన్ని కల్లో జనసేనపార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. పోలింగ్ బూత్ పరిధిలో జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకొని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ 17 సంవత్సరాలు పూర్తి అయ్యి 18 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న యువత చేత ఓటు హక్కు నమోదుచేయించుకునే విధంగా కమిటీ సభ్యులు పని చేయాలని కోరారు. ఈ మేరకు గూడూరు పార్టీ కార్యాలయంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తీసుకువెళ్లి జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్, సుధీర్, మున్వర్ బాషా,గూడూరు పట్టణ, రూరల్, కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల జనసేనపార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఇంద్రవర్ధన్, నాగార్జున, విష్ణు, భాస్కర్, నవీన్, జమాల్, మనోజ్ కుమార్, వాసు, అక్బర్ బాషా, నవీన్, సుబ్రహ్మణ్యం, కార్తీక్, వంశీ, ఇమ్రాన్, జగదీష్, మోహన్, కోటి, సాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com