పాయకరావుపేట (జనస్వరం) : మండలంలోని మంగవరం పంచాయతీ పరిధిలోని ఆదివారం జనంతో" జనం కోసం జనసేన" కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ప్రోత్సాహం తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాసమస్యలపై జనసేన పార్టీ ఎప్పుడు పోరాడుతుందని ప్రజలకు తెలియజేశారు. ఒక సారి జనసేన పార్టీ కి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో దొడ్డిపట్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీను,పేపకాయల లింగాలు, బోడపాటి రాజు, దేశంశెట్టి చిన్న, కట్టా నరసయ్య, గాబు శివ, పడాల శివ, పడాల శుభాష్,గట్టెం మల్లి, ఆరుగుల రమేష్ పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com