Logo
Date of Publish : 11 July 2022, 6:43 am
Editor : Sake Naresh

ఎచ్చర్ల నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమము

            ఎచ్ఛర్ల ( జనస్వరం ) : మండలంలోని భగీరథపురం మరియు ధర్మవరం గ్రామాల్లో జనసేన పార్టీ టీమ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మహోత్సవములు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ యొక్క ఆవశ్యకతను ప్రజలకు యువతకు వివరించారు. అలాగే ఎచ్చర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి  మాట్లాడుతూ జనసేన పార్టీనీ బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క జనసైనికుడు పైన, ప్రతి ఒక్క వీర మహిళలపైన ఉందని వివరించారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తన సొంత ధనంతో చేస్తున్న ముఖ్య కార్యక్రమాలు కౌలు రైతులను ఆదుకునే విధానం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రజల కష్టాలను ప్రస్తుతం జనవాణి కార్యక్రమం ద్వారా వారి యొక్క ఆవేదనలను, సమస్యలను సేకరిస్తున్న విధానం గురించి, పార్టీ మేనిఫెస్టో, సిద్ధాంతాల గురించి ధర్మవరం గ్రామంలో సభలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదేవిధంగా నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఈ జెండా ఆవిష్కరణలు చేపట్టాలని జనసైనికులకు యువతకు అందరికీ కూడా ఈ సభ ద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల నాయకులు తమ్మినేని శ్రీనివాస్, ధర్మవరం జనసేన నాయకులు పాలిశెట్టి సురేష్, రణస్థలం మండల నాయకులు దన్నాన చిరంజీవి, లావేరు మండల నాయకులు బొంతు విజయ కృష్ణ, జి.సిగడాం మండల నాయకులు మీసాల రామకృష్ణ, రణస్థలం రెడ్డి భాస్కరరావు, దన్నాన సంతోష్, ఆరుముడి రాము, ఎచ్చెర్ల మండల నాయకులు సంతోష్, హేమ సుందర్, పిన్నింటి సురేష్,ధర్మవరం జనసైనికులు మరియు భగీరథపురం జనసైనికులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com