నెల్లూరు ( జనస్వరం ) : నగరంలో సోమవారం జనసేన జెండా రెపరెపలాడింది. ఏ వీధి చూసినా .. ఏ ప్రాంతం చూసినా జనసేన జెండాలే కనిపించాయి. నెల్లూరు నగరంలో ఒకేసారి 28 డివిజన్లలో ఆయా డివిజన్ ఇన్చార్జుల ఆధ్వర్యంలో జనం కోసం జ నసేన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని 3,14, 54,తదితర వార్డుల్లో జనసేన జి ల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న స మస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి యోగక్షేమాలు ఆరా తీశారు. నాలుగ న్నరేళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి , అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అ త్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా జనం కోసం జనసేన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. అంగన్వాడీలు,మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా బెదిరింపు చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. వారిపై ఎస్మా చట్టం తీసుకురావడం సిగ్గు చేటన్నారు. త్వరలోనే ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్. ఆలియా,నాయకులు సుల్తాన్, అజయ్,శ్రీకాంత్, డివిజన్ ఇన్ చార్జులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com