గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటినగరం మండల కేంద్రంలో, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం తెలియజేసింది. ఈ కార్యక్రమానికి జనసేన ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి Dr యుగంధర్ పొన్న హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభువే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలని, కలలోనైనా కనిపించి అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సహాయం చేయాలని, వారు కోరుతున్న 20 డిమాండ్లకు సరైన పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. జనసేన ఈ రాష్ట్రంలో , నియోజకవర్గంలో కానీ సమస్యలు ఎక్కడ ఉంటుందో, అక్కడ జనసేన వస్తుందని, సమస్య పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. మూడు నెలల్లో ఏర్పాటు కాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో డిమాండ్లన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలన్నిటిని పవన్ కళ్యాణ్ దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్తామని సందర్భంగా తెలిపారు. అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ లందరికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, వెంకటేష్ కార్వేటి నగరం మండల బూత్ కన్వినర్ సురేష్ రెడ్డి, కార్వేటి నగరం బిసి సెల్ అధ్యక్షులు దేవా, జిల్లా సంయుక్త కార్యదర్సులు రాఘవ, నరేష్, జనసేన ఇంచార్జి సతీమణి స్రవంతి రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వినర్ యతీశ్వర్ రెడ్డి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గం కార్యదర్శి కోదండన్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, పాలసముద్రం మండల కార్యదర్శి ప్రవీణ్, సీనియర్ నాయకులు శేఖర్, రుద్ర, చంద్ర,కార్వేటి నగరం టౌన్ ఉపాధ్యక్షులు సూర్యనరసింహులు పాల్గొన్నారు.