తిరుపతి, మార్చి26 (జనస్వరం) : తిరుపతి జనసేన-బిజెపి-టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి జనసేన ఎన్నికల ప్రచారం మొదలుకనుందని తెలిపారు. తిరుపతి నగర పవిత్రతను ఐదేళ్ళలో వైసిపి నేతలు దెబ్బతీశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో తిరుపతి ఒకటి తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేలా జనసేన పనిచేస్తుంది అని తెలియచేసారు. జీవకోన శ్రీ జీవలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించి క్రాంతి నగర్, సత్యనారాయణపురం, రాఘవేంద్ర నగర్ జీవకోన పరిసర ప్రాంతాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంతో జనసేన తిరుపతి గడ్డ జనసేన అడ్డా అనేవిధంగా చేస్తాము అని తెలియజేశారు. జనసేన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు విజయానికి అందరూ కలసికట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇస్తాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాటసారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, రాయలసీమ కోఆర్డినేటర్ ఆకుల వనజ, జిల్లా ప్రచారం కమిటీ నాయకులు దినేష్ జైన్,తిరుపతి నగర వార్డ్ అధ్యక్షులు నగర నాయకులు, జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com