
తెలంగాణ ( జనస్వరం ) : హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, నియోజకవర్గ ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో 32 నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుందని, బూత్ కమిటీలు వేసి పోటీకి సిద్ధం కావాలని ఇంఛార్జీలకు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇంఛార్జీలు తమ నియోజకవర్గాలలో ఉన్న పరిణామాలను పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర పర్యవేక్షణ సభ్యులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, తాడికొండ లికిత, శ్రీమతి రత్న పిల్ల, 23 నియోజకవర్గాల ఇంఛార్జీలు పాల్గొన్నారు.