
దెందులూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మీ సూచనలతో, దెందులూరు నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గం, కొవ్వలి గ్రామంలో గల షాలేము వృద్ధాశ్రమం నందు వృద్ధులకు నూతన వస్త్ర పంపిణీ, కేకుల పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార విభాగ వైస్ చైర్మన్ మోరు నాగరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ.శ్రీనివాస్, కార్యదర్శి ముత్యాల రాజేష్, సంయుక్త కార్యదర్శి కలపాల ప్రేమ్ కుమార్, నియోజకవర్గ ఐ.టి. కో-ఆర్డినేటర్ ఏనుగు రామకృష్ణ, దెందులూరు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.