పత్తికొండ, (జనస్వరం) : పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు పరిణామాలు ప్రకారం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రాణి హాని ఉందనిపిస్తుంది. ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంపై మాకు నమ్మకం సన్నగిల్లుతుంది. పవన్ కళ్యాణ్ ప్రాణం ఆయనకు ముఖ్యమో కాదో ఆయనకు తెలియదు కానీ మాలాంటి కోట్లాదిమంది అడుగడుగు పేద బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యం మన రాష్ట్రానికి ఆశాజ్యోతి ఆయన. పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం మనందరి బాధ్యత దయచేసి పవన్ కళ్యాణ్ కి కేంద్రం ప్రభుత్వం యొక్క జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర హోంమంత్రి అమీషాని కోరుచున్నాం. కొందరు దుష్ట శక్తులు ఆయన మీద రెక్కీ నిర్వహిస్తూ ఉండడం దారుణమైన అంశం అని అన్నారు. వైజాగ్ లో వైసీపీ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయి పవనన్నకి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికార పార్టీ, ప్రభుత్వం జీర్ణించుకోలేక అనేక రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని అన్నారు. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ని నిర్బంధం చేయడం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించడం దగ్గరనుండి పోలీసు వ్యవస్థ ప్రభుత్వ ఒత్తిడితోనే పని చేస్తుందనే విషయం అర్థమవుతుందని అన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై రెక్కీ నిర్వహించే స్థితికి చేరుకున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో తెలుస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయేలా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని, ఈ సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ కి బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కేంద్ర బలగాలను భద్రత కోసం కేటాయించాలని సిజి రాజశేఖర్ కోరారు.