● పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే భాధ్యత
● కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వకంగా కోరుతాం, లేదంటే మా ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడుకుంటాం..
హైదరాబాద్, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గుర్తుతెలియని వాహనాలు వెంబడించిన ఘటనపై అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రవణం స్వామి నాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ కు ఏదైనా జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే భాధ్యత అని అన్నారు. భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగన రాజకీయనాయకులు పవన్ కళ్యాణ్ అని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పవన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వకంగా కొరనున్నామని, లేదంటే మా ప్రాణాలైనా అడ్డుపెట్టి పవన్ కళ్యాణ్ ను కాపాడుకుంటామన్నారు.