సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసైనికుల పాదయాత్ర చేస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలం కాటేపల్లి నందు సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న స్వయంభుగా వెలసిన చంద్రశేఖర శివయ అనుగ్రహంతో 108 కొబ్బరికాయలు కొట్టి జనసేన, తెలుగుదేశం విజయ యాత్ర ప్రజా ప్రభుత్వ స్థాపన కోసం విజయ యాత్ర పేరుట పాదయాత్ర నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు వేళాంగిణి మాత చర్చి, వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి దర్శనం చేసుకునీ వైసిపి విముక్తి ఆంధ్ర ప్రదేశ్ కోసం సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం విజయకేతనం ఎగరవేయడం కోసం ఈ విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తామని అన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్ర ప్రదేశ్ తోపాటు సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా వైసిపికి డిపాజిట్లు లేకుండా ఓడించి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందన్నారు. జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం 117 పంచాయతీల్లో రాబోయే 2024 తర్వాత ప్రజా ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంటుందో చూపించే విధంగా కల్లక కట్టినట్టు వివరిస్తూ ప్రజల్లోకి వెళుతున్న అదే విధంగా ఈ పాదయాత్రలో అనేక సమస్యలను ప్రజలు ఇబ్బందులని రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు సందీప్, శ్రీనివాసులు, రవి, వీరా మహిళ శ్రీదేవి, ఐటీ విభాగం ప్రసాద్ పొదలకూరు మండలాధ్యక్షుడు అనిల్, వెంకటాచల మండలం నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, అశోక్, హరి, మస్తాన్, చిన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com