నెల్లూరు ( జనస్వరం ) : పర్లకొండ గ్రామంలోకి వెళ్లి అక్కడున్న ప్రజలతో మమేకమై వాళ్లకి జనసేనపార్టీ సిద్ధాంతాల్ని, ఆశయాలను,పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమాలను మరియు క్రియాశీలక సభ్యత కార్యక్రమాన్ని అక్కడున్న ప్రజలకు వివరించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం వల్ల కలుగు ప్రయోజనాలను ప్రజలకు తెలియపరచి అక్కడున్న ప్రజల చేత సభ్యత్వం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ్ వెంకటపతి, సుంకు రామ కిషోర్, నరేష్, రామకృష్ణ, శ్రీహరి మరియు వీర మహిళ ప్రవళిక పాల్గొన్నారు.