Logo
Date of Publish : 14 October 2023, 10:06 pm
Editor : Sake Naresh

ఒంగోలులో విస్కృతంగా జనచైతన్య యాత్ర కార్యక్రమం

   ఒంగోలు ( జనస్వరం ) : స్థానిక నాయకులు కోటు కిరణ్, పసుపులేటి రాజ్ గోపాల్, గద్దె సాయి మహేష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 23వ రోజు జనచైతన్య యాత్ర లో భాగంగా ఒంగోలులోని 11వ డివిజన్ రైల్ పేట లో పర్యటించడ౦ జరిగింది. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా అయ్యన్న శెట్టి సత్రం వాసులు జనసేన నాయకులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా నివాసం ఉంటున్న మాకు పట్టాలు ఇవ్వలేదని, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తారే తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉంటుందని మంచి చేసే నాయకుడు వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత సమస్యను తీర్చడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, మరియు జనసేన నాయకులు బండారు సురేష్, నారాయణరావు, నరసింహారావు, అవినాష్ పర్చూరి, చంద్ర, శ్రీనివాస్, ప్రిన్స్ మరియు వీర మహిళ మాదాసు సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com