ప్రకాశం ( జనస్వరం ) : స్థానిక నాయకులు నరసింహారావు, రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 63వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ అడుగడుగునా వారి సమస్యలను జన చైతన్య యాత్ర బృందానికి తెలియజేసిన ఇందిరమ్మ కాలనీ వాసులు, కనీసం కాలువలు, రోడ్లు కూడా మా ప్రాంతంలో లేవని ఎంతమందిని అడిగినా చేస్తామని హామీ ఇస్తారే తప్ప ఎలక్షన్స్ తర్వాత చేసిన పాపాలు పోలేదని అన్నారు. సాయంత్రం అయిందంటే దోమల బెడదతో నాన్న ఇబ్బందులు పడుతున్నామని, కచ్చితంగా ఈసారి జనసేన పార్టీకి అండగా నిలుస్తామని కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, ఉంగరాల వాసు, యాదల సుధీర్, సాయి, రవీంద్ర, భరత్, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com