ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం ( రాపాక జంక్షన్ ) ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమ౦ జరిగింది. ఇంటి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు వివిధ అంశాలుతో కరపత్రం రూపంలో జనం కోసం జనసేన కార్యక్రమంతో వివరించారు. గ్రామంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆయనతో పాటుగా మండల నాయకులు యలకల రమణ, చిన్నమనాయుడు, లోలుగు సురేష్, అసిరినాయుడు, శిమ్మినాయుడు, వసంత్, ప్రసాద్, గోవిందా, గణేష్, జగదీష్, రాజు, సింహాద్రి, సూరిబాబు, మున్న, మణి, తదితరులు పాల్గొన్నారు.