
వీరఘట్టం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడిమికెళ్ల గ్రామానికి చెందిన జైభీమ్ యువజన నాయకుడు పాలక వినోద్ ని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం, జనసేన జాని లు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాలక వినోద్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. నా మనసు అంత మా గ్రామంలో జనసేన పార్టీకి అండగా ఉండాలని, మా గ్రామంలో ఇంతవరకు ఎవరు జనసేన పార్టీ తరుపున ఒక్కరు వుండకపోవడం చూసాను. ఇకనుండి మా గ్రామానికి సేవ చేయాలి, ప్రజలకు అండగా ఉండాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా నిలిచి అడ్డుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని దృఢ నిచ్చయంతో వున్నాను. వీరఘట్టం మండలం జనసైనికులతో కలిసి పనిచేస్తానని, మా గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి నావంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అనంతరం మత్స పుండరీకం, జనసేన జాని మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రతి గ్రామంలో ఒక్కడితో మొదలై జనప్రభంజనంగా మారుతుదని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి ప్రజా ప్రభుత్వం స్థాపిస్తుందని అన్నారు. దత్తి గోపాల కృష్ణ, వావిలపల్లి నాగభూషన్ లు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేనపార్టీ అభివృద్ధికి యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘుమండల గణేష్, గోలి అనిల్, దూసి సందీప్, రౌతు గోవింద, కర్ణేన సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.