సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరుతున్న జగ్గయ్యపేట జనసైనికులు
జగ్గయ్యపేట నియోజకవర్గంలో పట్టణంలో స్థానిక చెరువు బజార్ సమీపంలో గల చెరువు నందు ఎప్పటినుంచో పేరుకుపోయి ఉన్నటు వంటి గుఱ్ఱపుటక్కను ముందుగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసైనికులతో కలిసి సందర్శించి, దానిని శుభ్రం చేయించాల్సిందిగా కోరుచున్నామని జనసేన పార్టీ తరుపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక పట్టణ మున్సిపల్ కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ గుఱ్ఱపుటక్క వలన పట్టణ ప్రజలు, అదే విధంగా సమీప చెరువు బజార్ ప్రజానీకం మరియు కార్ స్టాండ్ వారు ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఈ గుఱ్ఱపుటక్క వలన ప్రస్తుతం కరోనా ఎక్కువగా పట్టణంలో ప్రభలుతున్న వేళ దీని వలన వ్యాధులు సోకి కరోనా మరింత ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం వర్ష కాలం అవడంతో దీని వలన ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఆయన తెలిపారు. అదే విధంగా గత వారం రోజులుగా పట్టణంలో కురిసిన భారీ వర్షం వలన ఈ గుఱ్ఱపుటక్క ఇంకా ఎక్కువగా పేరుకు పోయి ఉండడంతో జనవాసాలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, తక్షణమే ఈ గుఱ్ఱపుటక్క ని శుభ్రం చెపిచవల్సినదిగా మరియు డ్రైనేజి లను కూడా శుభ్రం చేయించాల్సిందిగా నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము అని ఆయన తెలిపారు. కమిషనర్ వారు కూడా సానుకూలంగా స్పందించి ఎన్ ఎస్ పి వాటర్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి తప్పకుండా చూపిస్తాం అని అన్నారు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమంత్, తరుణ్, ఆసిఫ్, నాగ, పాషా తదితరులు పాల్గొన్నారు.