
ప్రమాదంలో కాలు దెబ్బతిని జీవనం సాగించలేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న ఒక పేద కుటుంబానికి అండగా జగ్గయ్యపేట జనసైనికులు
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గండ్రాయి గ్రామంలో నివసిస్తున్న పల్లపు శ్రీను ఆయన తల్లి పల్లపు పార్వతి మరియు కుమారుడు చందు లను గ్రామ జనసైనికుడు నాగయ్య మరియు గ్రామ జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకుని నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ బృందం ముందుగా వారిని పరామర్శించి వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ గండ్రాయి గ్రామ నివాసితుడైన పల్లపు శ్రీను ని ఆవిడ భార్య 6 సంవత్సరాల క్రితం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని, ఆయన కూలి పని చేసుకుంటూ, రిక్షా తొక్కుకుంటూ ఆయన్ని, ఆయన తల్లి ని కుమారుడిని పోషించుకుంటున్నారని, ప్రమాదవశాత్తు ఇనుప రేకు ముక్క కాలికి కోసుకుపోవటంతో ఎటూ కదలలేని పరిస్థితిలో ఉన్నారని, వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రతి నెలా వారికి నిత్యవసర సరుకులు, కూరగాయలు, బియ్యం అందిస్తామని, అదే విధంగా కాలికి సంబంధించి చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తమ వొంతుగా సహకారం అందిస్తామని తెలపటం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగయ్య, కె గోపి, గోపి, త్రిశాంత్, ఎలమందరావు, తదితరులు పాల్గొన్నారు.