
పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జగ్గయ్యపేట జనసైనికులు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ద్వారా చేస్తున్న వారోత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజున స్థానిక కాకని నగర్ ఏరియా లో గల పిల్లలలకి నోటు పుస్తకాలు, పాడ్స్ పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అధ్యక్షుల వారి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలు ద్వారా కరోనా నిబంధనలు పాటిస్తూ చేస్తున్నామని అందులో భాగంగానే ఇవాళ ఆయన జన్మదిన వారోత్సవాలని చిన్న పిల్లలతో మొదలు పెట్టటం చాలా సంతోషకరం గా ఉందని వారు తెలిపారు. పాఠశాలలు మొదలైన తరువాత వారి చదువు నిమిత్తం పాఠ్య పుస్తకాల కొరకు కొంత మేర సహాయం చేయటం జరిగిందని, నోటు పుస్తకాలు పంపిణీ జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టున రోజుకి జనసైనికులు కోసం అభిమానుల కోసం విడుదల చేస్తున్న గీతానికి సంబంధించిన పనుల నిమిత్తం ఆయన హైదరాబాద్ లో ఉన్నారని అందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ముందు ముందు జరగబోయే కార్యక్రమాలకు వస్తారని, అదే విధంగా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటానికి కూడా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్, తరుణ్, త్రిశాంత్, నాగ, తదితరులు పాల్గొన్నారు.