Logo
Date of Publish : 21 August 2020, 8:09 am
Editor : Sake Naresh

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పంచిన జగ్గయ్యపేట జనసైనికులు

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పంచిన జగ్గయ్యపేట జనసైనికులు

       జగ్గయ్యపేట నియోజకవర్గంలో పట్టణంలో పలు వీధులలో మరియు షాపులలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున మట్టి వినాయకుని బొమ్మలను పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పూజించాలి అనే ఉదేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్లల్లో మట్టి వినాయకుల్ని పూజించాలి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరు వినాయక చవితి ఉత్సవాలని తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని, కరోనా మహమ్మారి త్వరగా మన దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆ గణపతిని వేడుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ, అధ్యక్షుల వారికి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, హేమంత్, తరుణ్, పాషా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com