అబ్దుల్ కలాం వర్ధంతి నివాళులు అర్పించిన జగ్గయ్యపేట జనసైనికులు
భారతదేశ ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, మాజీ 11 వ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి 5వ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలో స్థానిక గవర్నమెంట్ హస్పిటల్ నందు గల ఉన్న అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడులో జన్మించిన ఆయన భౌతిక శాస్త్రం అభ్యసించి, వాటికి సంబందించినటువంటి రంగంలో చెన్నై, మద్రాస్ లాంటి ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్నో పట్టాలు పొందారని, భారత రాష్ట్రపతి పదవికి ముందు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు అని భారతదేశం యొక్క “మిస్సైల్ మాన్” అని పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి , వాహన ప్రయోగ సాంకేతిక అభివృద్ధికి కృషిచేశారు అని, కలాం తన పుస్తకం “ఇండియా 2020” లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు అని భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన “భారత రత్న” సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు అని, దేశానికీ సంబంధించి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన్ని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుచేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, త్రిశాంత్, రమణ, గోపి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.