Logo
Date of Publish : 09 December 2021, 10:11 am
Editor : Sake Naresh

SGS కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలని విద్యార్థుల చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన జగ్గయ్యపేట జనసేన నాయకులు

   జగ్గయ్యపేట, (జనస్వరం) : SGS కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా ఆ కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసనకు జగ్గయ్యపేట జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు భావి తరాల భవిష్యత్ అని అటువంటి వారు కళాశాలలో నాలుగు గోడల మధ్యన ఉండాల్సిన వారు ఇలా వారి కళాశాలని కాపాడుకోవడం కోసం ఇలా రోడ్ మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. SGS కళాశాల ఈ ప్రాంతంలో ఎంతో మందికి విద్య పరంగ ఉపయోగపడటమే కాకుండా ప్రతి కుటుంబంలో విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసించారని, అటువంటి కళాశాలని ఈరోజు ప్రైవేటికరణ చేస్తున్నారనే నిర్ణయం సరైనది కాదని విద్యార్థుల తరుపున జనసేన పార్టీ ద్వారా కళాశాల యాజమాన్యాన్నీ కోరుతున్నాం అని ఆయన తెలిపారు. జగ్గయ్యపేట ప్రాంత పరిధిలో ప్రభుత్వ కళాశాలలు లేక పేద, బడుగు వర్గాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని కళాశాల యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని, ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాజి, హేమంత్, పవన్, అజయ్, రాజు, సుమంత్, తరుణ్, రాం, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com