
జగ్గయ్యపేట, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసైనికులు మరియు మెగా అభిమానుల నడుమ స్థానిక కోదాడ రోడ్ లో గల వెంకట సన్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ మోసిన్ అహ్మద్ గారు పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా నాయకుని పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న మంచి సేవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం అని తెలియచేసారు. ఈమని కిషోర్ కుమార్ గారుమాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఆయన సైనికులుగా ఆయన చూపించిన బాటలో మేము కూడా ఆయన వెనకాల నడుస్తూ ఆయన సేవ స్పూర్తితో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. కరోన క్లిష్ట సమయంలో కూడా కేవలం ఒక్క పిలుపుతో అధ్యక్షుల వారి మీద అభిమానంతో సుమారుగా 70 మంది రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసారని, ముందు రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ శిబిరం నిర్వహించుకోటానికి సహకరించిన వెంకటసన్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు శైలజ, ప్రియాంక, నాయకులు ప్రసాద్, ప్రవీణ్, భాస్కర్, రాజు, నరసింహ, నాగయ్య, బ్రహ్మయ్య, నాగ, అజయ్, సాయి, బాజి మరియు జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.