ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా రోడ్డుపై వరి మొక్కలు నాటిన జగ్గయ్యపేట జనసేన నాయకులు
జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామం నుంచి గండ్రాయి వెళ్లే రహదారి మార్గాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బాడిశ మురళీకృష్ణ బృందం రహదారిని సందర్శించారు. వాగులను తలపిస్తున్న రహదారి గుంతలతో కూరుకుపోయి ఉండటంతో జనసేన నాయకులు వినూత్నం గా రహదారి మీద నీటితో నిండి ఉన్న గుంతల లో వరి నాట్లు వేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ షేర్ మహ్మద్ పేట గ్రామం నుంచి గండ్రాయి వెళ్లే రహదారిలో గుంతలు పడి రహదారి వాగులను తలపిస్తున్నాయని వచ్చే పోయే వాహన దారులకు చాలా ఇబ్బందికరంగా మారాయని రాత్రి సమయం లో ప్రయాణిస్తున్న వాహనదారులు వాహనాలు గుంతలో పడి, క్రిందపడి గాయాల పాలయ్యారని స్థానికులు మొరపెట్టుకుంటునారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రమాదాలు జరిగిన తరువాత అనుకున్న ప్రయోజనం ఉండదని ముందుగానే ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ రహదారిని మరమ్మత్తులు చేయాలని మురళీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొర్రపాటి గోపీచంద్, రామారావు, చారి, లింగరాజు,నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.