Logo
Date of Publish : 24 July 2020, 11:05 am
Editor : Sake Naresh

రోడ్డు సమస్యను పరిష్కారించాలని జగ్గయ్యపేట జనసైనికుల వినతి

రోడ్డు సమస్యను పరిష్కారించాలని జగ్గయ్యపేట జనసైనికుల వినతి.

జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండల పరిధిలో ఉన్నటువంటి లింగగూడెం గ్రామం నుంచి భీమవరం వెళ్లే మార్గం ప్రమాదకరంగా ఉండడంతో రోడ్ పనులని ప్రాంభించవలసినదిగా కోరుచున్నాము అని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్, కొర్రపాటి గోపీచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున ఆ రోడ్ మార్గాన్ని సందర్శించి, స్థానిక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ వారికి వినతిపత్రం అందివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజూ ఏంతోమంది ప్రజలు, రైతులు, విధ్యార్ధులు వారి వారి అవసరాలకి ఈ మార్గం గుండానే పెనుగంచిప్రోలు వస్తూ ఉంటారు అని మరీ దారి పొడుగునా రోడ్ మార్గం గుండా చాలా గుంటలు రోడ్ బాగా కిందకి కురుకునిపోయి ఉండడంతో వారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ప్రస్తుత వర్షా కాలంలో వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో వర్షపు నీరు రోడ్ మీద ఆగి ఉండడంతో ప్రజలు అదే విధంగా ఆ నీరు పంట పొలాల్లోకి వెళ్లటంతో రైతులు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఆయన తెలిపారు. మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బెజవాడ కనక దుర్గమ్మ వారి తరువాత అంతటి ప్రాముఖ్యత చెందిన అమ్మవారు పెనుగంచిప్రోలు గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ వారు 2 సంవత్సరాలకి ఒకసారి రంగుల మహోత్సవాన్ని జగ్గయ్యపేట లో ముగించుకుని తిరిగి చిల్లకల్లు మీదుగా భీమవరం గ్రామం నుంచి ఈ రోడ్ మార్గం గుండా భక్తులు కాలినడకన అమ్మవారి పల్లకీలు మోస్తూ పెనుగంచిప్రోలు చేరుకుంటారు అని అలాంటి సమయంలో భక్తులు కూడా చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు అని ఆ రెండు రోజులు గలస కూడిన మట్టిని పోసి చేతులు దులుపుకుంటున్నారని, పూర్తి స్థాయిలో ఈ రోడ్ కి అభివృద్ధి అనేది జరగటం లేదని ఆయన తెలిపారు. మరీ పనులకి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలోనే శంకుస్థాపన పనులు జరిగాయని, కొంత మేర నిధులు కూడా మంజూరు చేయటం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్ మార్గాన్ని పట్టించుకునే నాధుడే లీడని మరీ ప్రస్తుత ప్రభుత్వం ఐన తక్షణమే ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుని రోడ్ పనులని ప్రారంభించవల్సిందిగా ఈ రెండు గ్రామాల ప్రజల తరుపున జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగరాజు, చారి, నవీన్, మహేష్, రెహ్మన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com