రైతు బజారులో కరోనా అవగాహన గురించి, సమస్యల గురించి విన్నవించిన జగ్గయ్యపేట జనసైనికులు.
జగ్గయ్యపేట పట్టణంలో యన్.టి.ఆర్ సర్కిల్ వద్ద గల రైతుబజార్ లో కూరగాయలను అమ్ముకోవటానికి ఇరుకుగా ఉన్న రైతుబజార్ ని కరోనా కట్టడికి విశాలమైన ప్రదేశంగా మార్కెట్ యార్డును గుర్తించి రైతుబజార్ ని స్థానిక అధికారులు తరలించటం జరిగింది. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు ఇదే అదునుగా ఖాళీ అయిన రైతుబజార్ వెంబడి రోడ్ల పక్కన గతంలో రైతుబజార్ లో అమ్మిన వారు మరియు ప్రస్తుత రైతు బజారులో అమ్ముతున్న వారి తాలూకా వారిని పెట్టి తోప్పుడు బండ్ల పై కూరగాయలను అమ్మటం మెుదలు పెట్టారు అని, వీటి వలన పట్టణంలో ట్రాఫిక్ కి అంతరాయం కలగటమే కాకుండా, ప్రజలు భౌతికదురం పాటించకపోవడంతో కరోనా కేసులు ప్రబలుతున్నాయని ముందుగా తోపుడు బండ్లు వారి దగ్గరకి వెళ్లి జాగ్రత్తలు వివరించి, తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున స్థానిక రైతు బజార్ ఈఓ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుటూ మరీ ఈ తోపుడు బండ్ల వలన ప్రభుత్వ రైతుబజార్ ని నమ్ముకుని కూరగాయలు అమ్మే వారి బేరం పడిపోవడమే కాకుండా, పట్టణానికి దగ్గరవ్వటంతో ప్రభుత్వం చెప్పుతున్న సామాజిక దూరానికి ప్రజలు తూట్లు పొడవటంతో జగ్గయ్యపేటలో మరింత కరోనా పెరుగుతున్న సంఘటనలు కనబడుతున్నాయి అని వారు కూరగాయలను రైతుబజార్ సాక్షంగా ఇష్టాను సారంగా వ్యవహరించటమే కాకుండా రైతుబజార్ రేట్ల కన్న అధిక ధరలతో కూరగాయలను అమ్ముతున్నారు. అంతే కాకుండా సామాజిక దూరం లేకుండా కరోనా కి వారధులుగా అవుతున్నారని రైతుబజార్ ని నమ్ముకున్ని ప్రభుత్వ నిభందనలను పాటించిన రైతులకు రైతుబజార్ కూరగాయల వ్యాపారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు వీటి మీద తగు చర్యలు తీసుకుని తోపుడు బండ్ల కూరగాయల వ్యాపారులను కట్టడి చేసి పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నివారించే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని పట్టణ ప్రజల తరుపున,జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిశాంత్, తరుణ్, నాగ, గోపి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.