Logo
Date of Publish : 29 August 2020, 9:03 am
Editor : Sake Naresh

అయిన వాళ్ళే అంత్యక్రియలకు చేయకపోవడంతో జనసైనికులే అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నా జగ్గయ్యపేట జనసైనికులు

అయిన వాళ్ళే అంత్యక్రియలకు చేయకపోవడంతో  జనసైనికులే అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నా జగ్గయ్యపేట జనసైనికులు

దిక్కు లేని వారికీ జనసేన దిక్కు : జనసేన నాయకుడు బాడిశ మురళీకృష్ణ

      పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామం లో స్థానిక పంచాయితీ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న ఒక ఒంటరి కుటుంబంలో తల్లి కొడుకు తల్లి 80 ఏళ్ళ వృద్దురాళ్లు కొడుకు నాగేశ్వరావు రోజువారీ కూలి పనులకు వెళ్తు కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తు శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనం మీద నుండి క్రిందపడిపోయి మరణించడం జరిగింది. తల్లి వృద్ధురాలు కావడంతో ఆమె నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆ తల్లి చుట్టుపక్కల ఉన్న స్థానికులను వేడుకుంది.  ఎవరు ముందుకు రాలేదు, చివరకి స్థానికంగా ఉన్న నాయకులకు చెప్పిన ప్రయోజనం లేకపోయింది, చివరగా పంచాయితీ సిబ్బందిని బ్రతిమిలాడినా వారు సహకరించలేదు. ఈ విషయన్ని పెనుగంచిప్రోలు జనసేన పార్టీ నాయకులు చారి అందించిన సమాచారం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు వారి ఇంటివద్దకు చేరుకొని దగ్గరుండి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి దగ్గరుండి ఆ శవానికి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది.  తదుపరి ఆ తల్లిని ఓదార్చి జనసేన పార్టీ నీకు అండగా ఉంటుందని భోరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ దిక్కు లేని కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఇలాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఎక్కడ వచ్చిన సరే జనసేన పార్టీకి తెలియజేయమని వారికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాడిశ మురళీకృష్ణ, చారి, కొర్రపాటి గోపీచంద్, రామారావు, గోపి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com