Logo
Date of Publish : 25 May 2021, 5:30 am
Editor : Sake Naresh

కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సలహాలు సూచించిన జగ్గంపేట జనసేన నాయకులు పాతంశెట్టి సూర్య చంద్ర

          రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని, వాటి మీద చర్యలు మాత్రం శూన్యం అని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాతంశెట్టి సూర్యచంద్ర గారు పత్రికా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కొన్ని సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏ‌ఎన్‌ఎం ల పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే వీరి దగ్గర అవసరమైన పల్స్ మీటర్, థర్మల్ మీటర్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ కరోనా కిట్లు వారి దగ్గర లేకపోవడం వలన మరింత సమయం వృథా అవ్వడమే కాకుండా, ఈ లోపు మరింత వ్యాప్తి చెందుతోంది. ఒకవేళ బయట కొందామంటే బ్లాక్ మార్కెట్ దందా దారుణంగా నడుస్తోందన్నారు. అలాగే డాక్టర్లకు, పోలీసులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అవసరమైన కరోనా కిట్లు అందించకుండా కరోనా పై యుద్ధం చేయమనడం హాస్యాస్పదం అని అన్నారు. వీరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. అందుకు గల కారణం గతంలో మీరు ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఫీవర్ సర్వే వాలంటీర్ల ద్వారా చేయిస్తోందని అబద్ధపు బూటకపు నాటకం ఆడుతోంది. వాలంటీర్లుకు ఇప్పటి వరకూ థర్మల్ స్క్రీన్లు ఇచ్చింది లేదు. అలాంటప్పుడు వారు ఫీవర్ సర్వే ఎలా చేస్తారని ధ్వజమెత్తారు. కరోనా వచ్చిన వారిలో సగం మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో లేదట, ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షలు ధారపోయాలాట అనే వార్తలతో భయభ్రాంతులకి గురవుతున్నారు. కావున ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సచివాలయంలో కూడా ప్రభుత్వ స్కూళ్లను క్వారంటైన్ సెంటర్ లాగా ఏర్పాటు చేయాలని, 30 బెడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి గ్రామానికి 5 నుండి 10 ఆక్సిజన్ సిలెండర్లు కల్పిస్తే ప్రజలు కూడా కాస్తా ధైర్యంగా ఉంటారు. ఈ పద్ధతినే కేరళ రాష్ట్రంలో విజయవంతంగా నడిపిస్తున్నారు. అక్కడ మరణాల శాతం చాలా తక్కువ అని గుర్తు చేశారు. నెల్లూరులో ఆనందయ్య గారు కరోనా మందు ఇస్తున్నారు అంటే అక్కడికి దాదాపుగా 30వేల మంది తమ స్వస్థలాల నుంచి ప్రయాణం చేసి వెళ్లారు. అందుకు గల కారణం అక్కడికి వెళ్ళి ఆ మందు తీసుకుంటే బ్రతుకుతామనే ఆశ సగటు మనిషిలో ఉంది. కావున నేడు చాలా మంది కరోనా వచ్చిందనే ఒత్తిడికి లోనై, భయభ్రాంతులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జనసేన పార్టీ తరుపున ప్రతి గ్రామంలో కూడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి, సరైన వసతులు కల్పించాలని కోరారు. గ్రామాల్లో ఏ‌ఎన్‌ఎం ల సేవలు ఈ సమయంలో చాలా అవసరమైనవి అని వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. సీయం గారు కూడా ప్రజా క్షేత్రంలోకి వచ్చి సమస్యలు ఎలా ఉన్నాయో, ప్రజల ఆవేదనని గుర్తించాలని కోరారు.    

 

ఇవి కూడా చదవండి :

హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com