జగ్గంపేట ( జనస్వరం ) : టిడిపి యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమానికి జనసేన టిడిపిల పొత్తు ధర్మంలో భాగంగా మద్దతు తెలిపిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ నేపథ్యంలో సూర్యచంద్రతో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు. జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అన్ని పరిణామాలు తమకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయని అతి కొద్ది కాలంలోనే ఆ సమస్యలన్నీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలోనీ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రారంభించిన జనం కోసం జనసేన అనే కార్యక్రమం 725 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సూర్యచంద్రను ప్రత్యేకంగా అభినందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com